ఇగ సూసుకో పని మొదలు బెట్టింది... సుడిగాడు... ఒక్క టిక్కెట్టుపై వంద సినిమాలు అన్నట్టు... ఒక్క రోజే ఎన్ని పనులు జేసిందో... కూలికి పోయినా.. రోజంతా చేసిన పనే చేసి చేసీ విసుగొస్తుంది. అందుకే కనిపించిదల్లా చేసి పనిలోనే ఎంటర్టైన్మెంటు ఎతుక్కుంది. కాకపోతే గివన్నీ ఉచిత సేవలే...
ఎన్నికల కూలీలు...అన్ని సేవలూ ఉచితం
ఓటర్ల దగ్గరకు వెళ్లి అమ్మా.. అయ్యా.. మేం అది చేశాం.. గెలిస్తే ఇది చేస్తాం అంటూ ఓట్లడగడం ఒకప్పటి మాట. ఇప్పుడు హైటెక్ కాలం కదా.. అప్పటిలాగే చేస్తే కిక్కేముంటుంది. కొత్తదనం ఉండాలి కదా. ప్రచార శైలిలో కాస్త మార్పులు చేసి చంటిగాడి నుంచి ముసలితాత వరకు ఎవర్నీ వదిలిపెట్టకుండా ఆకట్టుకుంటున్నారు. ఈ వింత చేష్టలకు వినూత్న ప్రచారాలంటూ ఓ మంచి ట్యాగ్ లైన్ తాకించి ఓట్ల వేట సాగిస్తున్నారు.
చిన్న పాపను ఎత్తుకొని ఎట్లా లాలిస్తుందో సూడు... ఆ జోలకు తల్లి ఓటేయక ఊకుటుందా? అగ సూడు.. కన్నోళ్లకే బువ్వ పెట్టను పో.. అంటున్న కలికాలంలో... తాతకు ఎంతమంచిగా తినిపిస్తుందో. అందరి ముందు మందు పోస్తే బాగోదు అనుకుందేమో.. తాతకు కల్లుతోనే సరి పెట్టింది. మహిళా శక్తిని వదిలిపెడితే ఊరుకుంటామా? మిరపకాయలతొడిమలు తీసి ఆళ్లకూ... కాస్త సాయం జేసింది. మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఒకాయన రెంటికి కూడా కడిగిండు. ఈమె కాస్త తగ్గి చంటిగాడికి స్నానంతో సరిపెట్టింది. అబ్బబ్బా ఎంత మంచిగా చేసిందీమె.. రోజూ గిట్లనే జేస్తే బాగుండు అనుకుంటున్నరు జనాలు.
ఇవీ చూడండి:ఈ పార్టీకి మేనిఫెస్టో లేదు, అయినా గెలుస్తూనే ఉంది