ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎంపీలందరూ తమ ప్రాభవాన్ని చూపారు. కొంతమంది ఎక్కువ ఓట్ల తేడాతో గెలుపొందింతే.. మరికొందరు స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. భాజపాకు చెందిన సీఆర్ పాటిల్ 6.86లక్షల ఓట్ల తేడాతో గుజరాత్‌లోని నవ్సారీ నుంచి నెగ్గారు. ఈ ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజార్టీ.
లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ.. ప్రీతమ్ ముండే పేరిట ఉంది. దివంగత గోపీనాథ్ ముండే మరణానంతరం మహారాష్ట్ర బీడ్ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో ఈమె 6. 96 లక్షల భారీ ఆధిక్యంతో రికార్డు స్థాయి విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో 5లక్షల మార్జిన్‌తో గెలిచిన కొంతమంది..
ప్రధాని నరేంద్రమోదీ దాదాపు 5లక్షల (4.79లక్షలు) ఓట్లతేడాతో సమీప సమాజ్‌వాది ప్రత్యర్థి షాలిని యాదవ్‌పై విజయం సాధించారు. వారణాసి నుంచి పోటీచేసిన మోదీ గత ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. భాజపా అధ్యక్షుడు అమిత్ షా గాంధీనగర్ నుంచి 5.57 లక్షల తేడాతో నెగ్గారు. కాషాయం పార్టీకే చెందిన సంజయ్ భాటియా హరియాణా కర్నాల్ నుంచి 6.56 లక్షల మెజార్టీతో గెలిచారు. వీరేగాక భాజపాకు చెందిన కృషన్ పాల్, సుభాష్ చంద్ర బహేరియా, శంకర్ లల్వానీ తదితరులు దాదాపు 5లక్షల మెజార్టీతో గెలిచారు.
తక్కువ మెజార్టీ బోలానాథ్దే...