తెలంగాణ

telangana

ETV Bharat / elections

భారత్ భేరి: దేవభూమిలో పోరు ద్విముఖమే!

2009 సార్వత్రిక సమరం... ఉత్తరాఖండ్​లోని 5 లోక్​సభ స్థానాలు కాంగ్రెస్​వే. 2014లో అన్ని నియోజకవర్గాల్లో భాజపాదే ప్రభంజనం. రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడిన ప్రాంతీయ పార్టీల ఊసు లేదు. ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీల ప్రభావం లేదు. మరి ఈసారి ఏం జరుగుతుంది?

దేవభూమిలో పోరు ద్విముఖమే!

By

Published : Apr 7, 2019, 6:33 PM IST

దేవభూమిలో పోరు ద్విముఖమే!

ఉత్తరాఖండ్​ ఏర్పడి 19ఏళ్లు. మధ్యలో 3 సార్వత్రిక సమరాలు. గెలుపు మాత్రం ఎప్పుడూ రెండు ప్రధాన జాతీయ పార్టీల అభ్యర్థులదే. ఒకే ఒక్కసారి ఎస్పీ అభ్యర్థిని విజయం వరించింది.

గత ఎన్నికల ఫలితాలు

ఉత్తరాఖండ్​ రాజకీయం భాజపా, కాంగ్రెస్​ చుట్టూనే తిరగడానికి కారణం ఏంటి?

"ఉత్తరాఖండ్​ సరిహద్దు రాష్ట్రం. ఇక్కడి ప్రజల్లో అనేక మంది సాయుధ దళాల్లో పనిచేస్తారు. కాబట్టి జాతీయ భావాలు ఎక్కువ. అందుకే ప్రాంతీయ పార్టీలను వారు ప్రోత్సహించరు.
ఉత్తరాఖండ్​కు చెందిన గోవింద్​ వల్లభ్​ పంత్​, హేమ్​వతి నందన్​ బహుగుణ, ఎన్​డీ తివారీకి జాతీయస్థాయిలో పేరుప్రఖ్యాతలు ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు జాతీయ దృక్కోణంతోనే ఆలోచిస్తారు."
-- జైసింగ్​ రావత్​, రాజకీయ విశ్లేషకుడు

ఈసారీ అంతే!

ప్రస్తుత ఎన్నికల్లో 5 స్థానాల్లో నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి భాజపా, కాంగ్రెస్. ఎస్పీ, బీఎస్పీ ఉత్తరాఖండ్​లోనూ కలిసి పోటీచేస్తున్నాయి. పొత్తులో భాగంగా ఐదింట ఒక స్థానం ఎస్పీకి దక్కింది. సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్​ భార్య డింపుల్​ పౌరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తొలుత ఊహాగానాలు వినిపించాయి. ఆమె జన్మస్థలం ఉత్తరాఖండ్​ అవడం ఈ వార్తలకు ఊతమిచ్చింది. అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంది ఎస్పీ. బలమైన అభ్యర్థి లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పింది. మిగిలిన 4 స్థానాల్లో బీఎస్పీ పోటీచేస్తోంది.

"కాంగ్రెస్​, భాజపా మినహా ఉత్తరాఖండ్​లో మరే ఇతర రాజకీయ పార్టీలకు క్షేత్రస్థాయిలో బలం లేదు. కాబట్టి ఎన్నికల్లో పోటీ ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యే."
-- అవదేశ్​ కౌశల్​, రాజకీయ విశ్లేషకుడు

"తృతీయ కూటమి ఏర్పాటుకు ప్రాంతీయ పార్టీలు ప్రయత్నించాయి. కానీ అవన్నీ చివరకు భాజపాలోనే, కాంగ్రెస్​లోనే విలీనం అయిపోయాయి. భాజపా, కాంగ్రెస్​ ప్రధాన పోటీదారులుగా మిగిలాయి."
-- జైసింగ్​ రావత్​, రాజకీయ విశ్లేషకుడు

కూటమికి ప్రయత్నించినా...

1990 నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన స్థానిక పార్టీల్లో ఉత్తరాఖండ్​ క్రాంతి దళ్​-యూకేడీ ఒకటి. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండబోతుందని అందరూ భావించారు. కానీ కాంగ్రెస్​, భాజపా ముందు యూకేడీ నిలవలేకపోయింది.
గత లోక్​సభ ఎన్నికల్లో యూకేడీ అభ్యర్థులు దాదాపు అందరూ డిపాజిట్లు కోల్పోయారు. అయినా... ఈసారి విజయంపై ధీమాగా ఉంది ఉత్తరాఖండ్​ క్రాంతి దళ్​. 5 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టింది.

ఇవీ చదవండి:కాంగ్రెస్..​ మునిగిపోతున్న టైటానిక్​ ఓడ : మోదీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details