తెలంగాణ

telangana

ETV Bharat / elections

భారత్​ భేరి: ఎన్నికల భారతంలో తొలిదశ పోలింగ్

దేశంలోని మొత్తం 91 లోక్​సభ స్థానాలకు కాసేపట్లో పోలింగ్​ ప్రారంభం కానుంది. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 14 కోట్ల 20 లక్షల 54 వేల మంది ఓటర్లు 1279 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. మిగిలిన 6 విడతల పోలింగ్ ముగిశాక మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.

ఎన్నికల భారతంలో తొలిదశ పోలింగ్​

By

Published : Apr 11, 2019, 5:46 AM IST

ఎన్నికల భారతంలో తొలిదశ పోలింగ్​

1,279 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 14 కోట్ల 20 లక్షల 54 వేల మంది ఓటర్లు కాసేపట్లో ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. మొత్తం 91 లోక్​సభ స్థానాలకు తొలిదశలో పోలింగ్​ జరగనుంది.

మొత్తం 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కాసేపట్లో తొలిదశ పోలింగ్​ మొదలుకానుంది. ఎన్నికల కోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు.

తెలుగు రాష్ట్రాల్లో...

ఆంధ్రప్రదేశ్​ -25, తెలంగాణ- 17 కలిపి మొత్తం 42 లోక్​సభ స్థానాలకు నేడు పోలింగ్​ జరగనుంది. మొదటి విడతలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియనున్నాయి. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

యూపీలో భారీ బందోబస్తు..

అత్యధిక లోక్​సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్​లో నేడు 8 లోక్​సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ఎన్నికల సంఘం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. లక్ష మందికిపైగా భద్రతా సిబ్బందిని మోహరించారు.

బస్తర్​ కట్టుదిట్టం..

ఛత్తీస్​గఢ్​ బస్తర్​ లోక్​సభ నియోజకవర్గంలో భద్రత కట్టుదిట్టం చేశారు. 80 వేల మంది సిబ్బంది పహారా కాస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడమే ఇందుకు కారణం. దంతెవాడ ఈ నియోజకవర్గం కిందకే వస్తుంది. 741 పోలింగ్​ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు.

'రసీదు' ఎన్నికలు...

సార్వత్రిక ఎన్నికల కోసం తొలిసారి పూర్తిస్థాయిలో వీవీప్యాట్​ ఈవీఎంలు ఉపయోగిస్తోంది ఈసీ. వీవీప్యాట్​లో వచ్చే రసీదు చూసి, మన ఓటు ఎవరికి పడిందో నిర్ధరించుకోవచ్చు.

ఎన్నికల భారతంలో తొలిదశ పోలింగ్​

ABOUT THE AUTHOR

...view details