Lone App gang member arrest: లోన్ యాప్ ద్వారా ప్రజలను వేధింపులకు గురి చేస్తూ.. మోసం చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన అంతర్జాతీయ ముఠా సభ్యుడిని ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లా సీకే దిన్నే పోలీసులు అరెస్టు చేశారు. పది రోజుల కిందటే ఆరుగురు లోన్ యాప్ నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిచ్చిన సమాచారం మేరకు రాజస్థాన్‌కు వెళ్లి జాను యాదవ్ అనే నిందితుడిని అరెస్టు చేశారు.
లోన్‌యాప్ వేధింపులు.. రాజస్థాన్‌కు చెందిన నిందితుడు అరెస్టు
Lone App gang member arrest: లోన్ యాప్ వేధింపులపై పోలీసులు దృష్టిసారిస్తున్నారు. తాజాగా లోన్‌యాప్ ముఠాకు సంబంధించి రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తిని ఏపీలోని కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
Loan app
జాన్ యాదవ్ బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తే దాదాపు రూ.20 కోట్ల లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలిందని జిల్లా ఎస్పీ అన్బు రాజన్ తెలిపారు. ఈ ముఠా సభ్యుడు హంకాంగ్‌లోని ఇద్దరు ఘరానా మోసగాళ్లకు ఈ లోన్ యాప్ డబ్బులు పంపిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని ఎస్పీ పేర్కొన్నారు. హాంకాంగ్‌లోని ఇద్దరు ముఠా సభ్యుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని ఎస్పీ వివరించారు.
ఇవీ చదవండి: