తెలంగాణ

telangana

ETV Bharat / crime

వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ - Viveka murder case transferred to CBI court

YS Viveka murder case
YS Viveka murder case

By

Published : Nov 29, 2022, 10:48 AM IST

Updated : Nov 29, 2022, 11:18 AM IST

10:44 November 29

వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ

Viveka murder case transfer to Telangana: ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ అయింది. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కేసును హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ విచారణపై మరణించిన వ్యక్తి కుమార్తె, భార్య అసంతృప్తిగా ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసును కడప న్యాయస్థానం నుంచి హైదరాబాద్‌ బదిలీ చేస్తున్నట్లు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా పేర్కొన్నారు.

ఈ కేసులో సాక్షులను, నిందితులు బెదిరిస్తున్నారని.. కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించింది.

ఇవీ చదవండి:

Last Updated : Nov 29, 2022, 11:18 AM IST

ABOUT THE AUTHOR

...view details