తెలంగాణ

telangana

ETV Bharat / crime

వీడియోల పేరుతో వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య - telanagana latest news

young women suicide ప్రేమపేరుతో యువతికి దగ్గరైయ్యాడు ఆ యువకుడు. వారు ఏకాతంగా ఉన్న సమయంలో తీసుకున్న వీడియోలు స్నేహితుడికి పంపించాడు. అంతే అక్కడితో ఆ యువతికి వేధింపులు ఎక్కువైయ్యాయి.అవి తట్టుకోలేక ఆమె చివరికి బలవన్మరణానికి పాల్పడింది.

Young woman commits suicide
Young woman commits suicide

By

Published : Aug 23, 2022, 5:12 PM IST

young women suicide: హనుమకొండ జిల్లా దామెర మండలం లాదెళ్ల గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన సంఘాల సాయి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.ఈ తరుణంలో చరవాణిలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. అదే క్రమంలో గ్రామానికి చెందిన సంఘాల సాయి స్నేహితుడు తాళ్లపల్లి ప్రణయ్ వారి వద్ద నుండి వీడియోలు సేకరించాడు.

ఆ వీడియోలతో యువతిని వేధింపులకు గురి చేశాడు. మనస్థాపానికి గురైన యువతి ఈ నెల 18వ తేదీన క్రిమిసంహారక మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. యువతిని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు వరంగల్లుకు తరలించారు. చికిత్స పొందుతూ యువతి సోమవారం రాత్రి మరణించింది. అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం లాదెళ్ల గ్రామానికి తరలించారు.

ఈ క్రమంలో తన కూతురు మరణానికి గ్రామానికి చెందిన సంఘాల సాయి, తాళ్లపల్లి ప్రణయ్ కారణమంటూ ఆరోపించారు. మృతదేహాన్ని వారి ఇంటి ముందు ఉంచేందుకు బంధువులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు మృతురాలి బంధువులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఏసీపీ శివరామయ్య న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details