Youth Gang War in LB Nagar : హైదరాబాద్ ఎల్బీనగర్లో శనివారం రాత్రి దారుణం జరిగింది. కేకే గార్డెన్ వెనక ఉన్న ఖాళీ ప్రదేశంలో మందుబాబులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో రెండు వర్గాల యువకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. కర్రలు, రాళ్లతో కొట్టుకోవడంతో నర్సింహారెడ్డి అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనలో మరో నలుగురికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.
Youth Gang War in LB Nagar : హైదరాబాద్లో గ్యాంగ్ వార్.. యువకుడు మృతి - hyderabad gang war case details
12:26 January 02
Youth Gang War in LB Nagar : హైదరాబాద్లో గ్యాంగ్ వార్.. యువకుడు మృతి
LB Nagar Gang War on New Year : శనివారం సాయంత్రం దుకాణం మూసివేసి.. కేకే గార్డెన్ వెనక ఉన్న ఉండే ఖాళీ ప్రదేశంలో మరో స్నేహితుడితో కలిసి నర్సింహారెడ్డి మద్యం సేవించాడు. అక్కడే ఉన్న మరో నలుగురు యువకులతో గొడవ తలెత్తింది. ఈ క్రమంలో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన నర్సింహారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకొని నర్సింహారెడ్డి స్నేహితులు అక్కడికి చేరుకోగా.. వారిపైనా ఆ నలుగురు యువకులు దాడి చేసినట్లు మృతుడి సోదరుడు తెలిపారు.
కేసు నమోదు చేసుకున్న ఎల్బీనగర్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన నలుగురు యువకులను ఆస్పత్రిలో చేర్పించారు.
ఇదీ చదవండి:Rowdy sheeter murder at tadepalligudem: రౌడీషీటర్, అతని అనుచరుడి హత్య..!