Loan app Harassment: రుణయాప్‌ల వేధింపులు బాధితులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. మౌనంగా భరించలేక.. బయటకు చెప్పుకోలేక నరకం అనుభవిస్తున్నారు. పోలీసు కేసులు.. అరెస్టులు మమ్మల్నేం చేయలేవంటూ నిర్వాహకులు అప్పు తీసుకున్న వారికి సవాల్ విసురుతున్నారు. రుణాలు పొందిన వారికే కాదు.. వారి ఫోన్‌లో ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఇంటాబయట పరువు తీసేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడుతున్నారు. ప్రభుత్వం లోన్ యాప్ నిర్వాహకులపై ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా మళ్ళీ పునరావృతం అవుతూనే ఉన్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా బయ్యారంకు చెందిన శ్యాంసుందర్ అనే యువకుడు బలయ్యాడు.
దా'రుణ' యాప్ వేధింపులు... బలైన మరో యువకుడు - పెరుగుతున్న లోన్‌యాప్ ఆగడాలు
Loan app Harassment: అవసరం కోసం అప్పు తీసుకుంటే.. అది చెల్లించే వరకు నరకం చూపెడుతున్నారు రుణయాప్ నిర్వాహకులు. కొన్నిసార్లు చెల్లించినా.. అదనపు వడ్డీ చెల్లించాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. లేదంటే బాధితుడు, స్నేహితుల ఫొటోలు మార్ఫ్ చేసి.. సామాజిక మాధ్యమాలలో వైరల్ చేస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు లోన్‌యాప్ వేధింపులకు బలయ్యాడు.
అత్యవసరంగా డబ్బులు అవసరం కావడంతో శ్యామ్‌సుందర్ హ్యాండీ లోన్ యాప్‌ను ఆశ్రయించాడు. 3వేల 500 రూపాయల రుణం తీసుకోగా... వారం రోజుల తర్వాత వాటిని తిరిగి చెల్లించాడు. అయినా లోన్ యాప్ నిర్వాహకులు లోన్ డబ్బులు కట్టాలంటూ వేధిస్తున్నారు. మళ్లీ కట్టకపోవడంతో... శ్యాంసుందర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోలుగా మార్చి అన్నీ గ్రూప్‌లలో పంపుతున్నారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోన్‌యాప్‌ల జోలికి వెళ్లకూడదంటూ సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తున్నాడు.
ఇవీ చదవండి: