తెలంగాణ

telangana

ETV Bharat / crime

మామ అంత్యక్రియలకు వెళ్లి యువకుడు మృతి - medak district latest news

విద్యుదాఘాతానికి గురై ఒక యువకుడు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుంది. మామ అంత్యక్రియలకు వెళ్లగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

young man was electrocuted while going to his uncle's funeral in Medak district Papannapeta mandal
మామ అంత్యక్రియలకు వెళ్లి యువకుడు మృతి

By

Published : Jun 12, 2021, 11:42 AM IST

మామ అంతక్రియలకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై ఒక యువకుడు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని రామతీర్థం గ్రామంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని కొత్త లింగాయిపల్లి గ్రామానికి చెందిన మహేష్... తన మామ మరణించడంతో.. అంతక్రియల కోసం రామతీర్థం గ్రామానికి వెళ్లాడు.

బహిర్భూమి కోసం రెండు పడకల ఇంటి నిర్మాణాల వెనుక భాగానికి వెళ్లగా.. బోరుబావికి విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ వైరుకు తగిలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పాపన్నపేట్ ఎస్సై సురేష్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: భూముల విక్రయానికి సర్కారు ప్రకటన.. జూలై 15న ఈ-వేలం

ABOUT THE AUTHOR

...view details