మరో నాలుగు రోజుల్లో పెళ్లి. వివాహ వేడుకలు మెుదలయ్యాయి. ఇంకా పత్రికలు పంచాల్సి ఉంది. వాటి కోసం వరుడు పయనమయ్యారు. కానీ.. అదే అతని చివరి ప్రయాణం అవుతుందని ఊహించలేకపోయారు. శుభలేఖలు ఇవ్వడానికి బైక్ మీదవెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
Accident: నాలుగు రోజుల్లో పెళ్లి.. పత్రికలు పంచడానికి వెళ్లి... - telangana news
మరో నాలుగు రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. బంధుమిత్రులతో సందడిగా ఉన్న ఆ ఇంట్లో ఆర్తనాదాలు వినివిస్తున్నాయి. పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు... కానరాని లోకాలకు చేరడంతో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
రోడ్డు ప్రమాదం, రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
పెళ్లి పత్రికలు పంచేందుకు బైక్‌పై వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొని అనంతపురం జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డికి చెందిన మహేశ్ (26) మృత్యువాత పడ్డారు. ఎరుకులవాండ్లపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. మహేశ్‌కు ఈ నెల 27న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు కానరాని లోకాలకు చేరడంతో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండి:FIRE ACCIDENT: ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణం