తెలంగాణ

telangana

ETV Bharat / crime

అంబేడ్కర్​ జయంత్యుత్సవాల్లో అపశ్రుతి.. విద్యుదాఘాతంతో యువకుడు మృతి - young man died in ambedkar jayanti arrangements

నిజామాబాద్​ జిల్లాలో అంబేడ్కర్​ జయంత్యుత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కొండాపూర్​ గ్రామంలో జయంతి వేడుకలకు ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

young man died with electric shock
అంబేడ్కర్​ జయంతి వేడుకల్లో యువకుడు మృతి

By

Published : Apr 14, 2021, 5:32 PM IST

బాబాసాహెబ్​​ అంబేడ్కర్ జయంతి వేడుకల కోసం స్నేహితులతో కలిసి ఏర్పాట్లు చేస్తుండగా ఓ యువకుడిని విద్యుదాఘాతం రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన.. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు యువకులు మంగళవారం.. అంబేడ్కర్​ జయంత్యుత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సమయంలో విగ్రహం వద్ద అజయ్​.. తోరణాలు, లైటింగ్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో మృతి చెందిన అజయ్​

యువకుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. చేతికందొచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు సాయం: ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details