యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్యాగల రాజు అనే యువకుడు మృతి చెందాడు. మండలంలోని మందనపల్లి గ్రామానికి చెందిన రాజు స్థానికంగా బైక్ మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. పనులు ముగించుకొని రాత్రి సమయంలో ప్రధాన రహదారి మీదుగా ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డు మధ్యన ఉన్న విద్యుత్ దీపం దిమ్మెను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు.
పనులు ముగించుకొని వెళ్తుండగా ప్రమాదం.. యువకుడు దుర్మరణం - తెలంగాణ వార్తలు
ఆలేరు పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పనులు ముగించుకొని ఇంటికెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రాజు మృతితో అతని కుటుంబం శోక సంద్రంలో మునిగింది.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి, ఆలేరు రోడ్డు ప్రమాదం
ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే రాజు మృతి చెందాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆలేరు ఎస్సై రమేశ్ తెలిపారు.
ఇదీ చదవండి:మిషన్ అరుస్తోంది.. నిజం చెప్పు!