Loan App Young Man Missing: రుణ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చనిపోతానంటూ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు. హైదరాబాద్ బోరబండ ఎస్సార్‌నగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ మతిన్.. డిగ్రీ వరకు చదువుకుని ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో డిసెంబర్ 30న బేగంపేటకు వెళ్తున్నానని చెప్పి.. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతనికి పలుమార్లు ఫోన్ చేశారు.
యువకుడు అదృశ్యం.. రుణయాప్‌ల వేధింపులే కారణం! - crime news
Loan App Young Man Missing: రుణ యాప్‌ల వేధింపులను భరించలేక యువకుడు అదృశ్యమయ్యాడు. తాను చనిపోతున్నానంటూ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సందేశం పంపాడు. ఇతని ఆచూకీ గురించి పోలీసులు గాలిస్తున్నారు.
లోన్ యాప్
మధ్యాహ్నం సమయంలో ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసినప్పటికీ.. రాకుండా తన సోదరుడికి ఓ ఎస్ఎమ్ఎస్ పంపాడు. రుణ యాప్ నిర్వాహకుల ఒత్తిడి భరించలేకపోతున్నానని, తాను చనిపోతానంటూ ఆ సందేశంలో పేర్కొన్నాడు. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అతని కోసం వెతికిన కుటుంబ సభ్యులు.. సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఇవీ చదవండి: