తెలంగాణ

telangana

ETV Bharat / crime

పోలీస్​స్టేషన్​కని వెళ్లింది.. అదృశ్యమైంది!​ - మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్

మేడ్చల్ జిల్లా మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ అదృశ్యమైన కేసు నమోదైంది. ఓ పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భార్య.. తిరిగి రాలేదంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

women went missing in medchal malkajgiri
పోలీస్​స్టేషన్​కని చెప్పి వెళ్లిన మహిళ మిస్సింగ్​

By

Published : Feb 27, 2021, 4:33 AM IST

కోర్టు కేసుల్లో ఉన్న వివాదాస్పద స్థలంలో నిర్మాణం చేపడుతోన్న నిందితులపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఓ మహిళ.. అదృశ్యమైంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా మల్కాజ్​గిరిలో జరిగింది.

ఈస్ట్ ఆనంద్​బాగ్​కు చెందిన గీతా రాణి అనే మహిళ... ఇంటి పక్కన ఉన్న వివాదాస్పద స్థలంలో కొందరు వ్యక్తులు అక్రమ కట్టడాలు చేపడుతున్నారు. వారిపై పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. రాత్రైనా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులును ఆశ్రయించారు. మిస్సింగ్​ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:అనుమానమే పెనుభూతమైంది... అనూష ప్రాణం తీసింది

ABOUT THE AUTHOR

...view details