తెలంగాణ

telangana

ETV Bharat / crime

Wife Suicide: భర్త సన్న బియ్యం తేలేదని భార్య ఆత్మహత్య - ఆత్మహత్య

చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్య చేసుకుని వారి జీవితాలనే కాదు వారి పిల్లల జీవితాలనూ అగమ్యగోచరంగా మారుస్తున్నారు. తన భర్త సన్న బియ్యం తేవడం లేదని ఆత్మహత్య చేసుకుంది ఓ భార్య. ఈ ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

suicide
ఆత్మహత్య

By

Published : Aug 31, 2021, 9:08 PM IST

క్షణికావేశంలో తమ ప్రాణాలను తీసుకుంటున్నారు కొందరు. చిన్న చిన్న కారణాలకే బలవన్మరణానికి ఒడిగడుతున్నారు. బ్రౌన్ రైస్ తినలేక తెల్ల బియ్యం తేవాలని ఇంట్లో వాళ్లకు చెప్పినా పట్టించుకోకపోవడంతో... ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది. నారాయణగూడ దత్తానగర్​కు చెందిన రాంబాబు, స్వప్నలకు వివాహమై 20 ఏళ్లు అవుతుంది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాంబాబు క్యాబ్ డ్రైవర్​గా పని చేస్తుండగా... స్వప్న సమీపంలోని ఓ బేకరీలో స్వీపర్​గా చేస్తుంది. వీరి పిల్లలు ఇంటర్ చదువుతున్నారు.

నిత్యం ఇంట్లో బ్రౌన్ రైస్ భోజనం చేస్తుంటారు వారు. ఎప్పుడైనా తెల్లన్నం తినాలని ఉందంటే స్వప్న కోసం భర్త తెల్ల బియ్యం ఒక కేజీ తెస్తుంటాడు. కొంతకాలంగా రాంబాబు తెల్లబియ్యం తీసుకురాకపోవడంతో... తాను చచ్చిపోతానంటూ స్వప్న బెదిరించేది. అయినా పట్టించుకోక పోవడంతో మనస్తాపానికి గురై ఇవాళ ఇంటిలోని గదిలో ఫ్యాన్​కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి శవగారానికి తరలించారు. సన్న బియ్యం కోసం ఆత్మహత్య చేసుకోవటంతో వారి పిల్లలు తల్లిలేని వారిగా మారారు. ఒక్క క్షణం ఆమె ఆలోచించి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదు.

ఇదీ చదవండి:WOMEN MURDER: గుంటూరు మహిళ హత్య కేసులో... కోడలే నిందితురాలు

ABOUT THE AUTHOR

...view details