భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న భాషమ్మ అనే మహిళను దుండగులు అతి దారుణంగా గొంతుకోసి హత్య చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో జరిగింది. గుమ్మడిదల గ్రామంలో నర్సాపూర్ మండలం లింగాపురానికి చెందిన భాషమ్మ అనే మహిళ, 12 ఏళ్ల కుమారుడు జగదీశ్‌తో నివాసం ఉంటోంది. ఆమె ఇంట్లోనే సోమవారం నాడు గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హతమార్చారు.
గుమ్మడిదలలో మహిళ దారుణ హత్య... గొంతు కోసి చంపేశారు!
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న మహిళను దుండగులు గొంతు కోసి హతమార్చారు. మృతురాలికి 12 ఏళ్ల కుమారుడు ఉన్నారు.
గుమ్మడిదలలో మహిళ దారుణ హత్య!
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్లూస్ టీం ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. బాగా పరిచయం ఉన్న వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.