మానసిక రుగ్మతల కారణంగా ఓ మహిళ... మూడేళ్ల కూతురుకి ఉరివేసి తనూ బలవన్మరణానికి పాల్పడిన ఘటన... సికింద్రాబాద్ ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ నెల 22న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒడిశా రాష్ట్రంలోని మీయూరభంజ్ జిల్లా బారిపాడకు చెందిన సుధేందుగిరి జీవనోపాధి కోసం నగరానికి వచ్చాడు. అల్వాల్ పరిధిలోని భరత్ నగర్లో నివసిస్తూ... సిద్దిపేట ప్రాంతంలోని ఓ ఫార్మా సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఆయనకు దాదాపు ఎనిమిదేళ్ల కిందట బిష్ణుప్రియ(30) అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి మూడున్నరేళ్ల కూతురు ప్రీతిక సంతానంగా జన్మించింది. ఈ నెల 22న ఉదయం సుధేందుగిరి రోజువారిగానే తన ఉద్యోగానికి బయలుదేరాడు. అతను తిరిగి రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి... తల్లీకూతుళ్లు విగతజీవులై కనిపించారు.