తెలంగాణ

telangana

ETV Bharat / crime

'నా భర్త పెట్టే బాధలు భరించలేక చనిపోతున్నా' - woman died with husband suffering

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనను చిత్రహింసలు పెడుతున్నాడని భరించలేక లేఖ రాసి మరణించింది. ఉద్యోగం చేయాలని ఇతరులతో పోల్చి వేధించేవాడని పేర్కొంది. తనను చంపి... వాళ్ల అక్క కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడని ఆమె వెల్లడించింది. ఆత్మహత్యకు తన భర్త, ఆయన సోదరులే కారణమంటూ లేఖ రాసి మరణించింది.

woman died with husband torcher,  jubilee hills hyderabad crime news
'నా భర్త పెట్టే బాధలు భరించలేక చనిపోతున్నా'

By

Published : Apr 28, 2021, 9:45 AM IST

Updated : Apr 28, 2021, 1:55 PM IST

‘‘ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. పెళ్లయిన నాటి నుంచి నా భర్త పెట్టే బాధలు భరించలేకపోతున్నా.. రోజు చిత్రహింసలే.. తీవ్రంగా కొట్టడంతోపాటు ఉద్యోగానికి వెళ్లమని చెప్పి... అక్కడున్న ఉద్యోగులతో కలిపి లేని పోని అభాండాలు వేసేవాడు.. చివరికి నన్ను చంపడానికి చూశాడు.. నా భర్తకు వాళ్ల అన్నయ్య చంద్రయ్య అండ.. నన్ను చంపేస్తే వాళ్ల అక్క బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానంటూ లేనిపోని మాటలు చెప్పాడు.. నా చావుకి ముఖ్య కారణం అతని సోదరులే.. నేను చనిపోతున్నాను.. నా భర్తను వదిలిపెట్టవద్దు. నా పిల్లలను మాత్రం మా అమ్మనాన్న, సోదరుల వద్ద ఉంచండి’’ అంటూ ఓ వివాహిత లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్​ జూబ్లీహిల్స్‌ పోలీసు ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.

మృతి చెందిన మహిళ రాసిన లేఖ

రహమత్‌నగర్‌ సమీపంలోని ఎస్పీఆర్‌ హిల్స్‌ రాజీవ్‌గాంధీనగర్‌లో నివసించే విజయ(31)కు పద్నాలుగేళ్ల కిందట ఆంజనేయులు అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లైన రోజు నుంచి భర్త ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 26వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో విజయ తన తల్లికి ఫోన్‌ చేశారు. పిల్లలు జాగ్రత్త అంటూ చెప్పి ఫోన్‌ కట్‌ చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం విజయ ఇంట్లో తలుపులు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

తమ కుమార్తె మృతికి అల్లుడు, అతని కుటుంబ సభ్యులే కారణమంటూ... విజయ తల్లి మణెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చూడండి:పెళ్లి చేసుకుంటానని పంజాబ్​ తీసుకెళ్లి..

Last Updated : Apr 28, 2021, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details