జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మోతె గ్రామానికి చెందిన గుర్రాల పద్మ ఉదయం 4 గంటలకు ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు మృతురాలి బంధువులు తెలిపారు. ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించినట్లు పేర్కొన్నారు. మగబిడ్డకు జన్మనిచ్చిన కొద్దిసేపటికే బాలింత మృతి చెందిందని వాపోయారు.
బాలింత మృతి... కుటుంబ సభ్యుల ఆందోళన - తెలంగాణ వార్తలు
వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలింత మృతి చెందిందని మృతురాలి కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. శస్త్ర చికిత్స సరిగా నిర్వహించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింత మృతి, ఆస్పత్రిలో ఆందోళన
వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. జగిత్యాల పట్టణ సీఐ జయేష్‌రెడ్డి, ఎస్సై శివకృష్ణ ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:మూడేళ్ల ప్రేమ... పెళ్లనగానే ముఖం చాటేసిన ప్రజా ప్రతినిధి