తెలంగాణ

telangana

ETV Bharat / crime

Suicide: 'జీవితంపై విరక్తి కలిగింది'.. అన్నస్నేహితుడి ఫోన్​కు మెసేజ్.. ఆ తర్వాత! - siddipet district latest news

అత్తింటి ఆరళ్లకు.. 22ఏళ్లకే నూరేళ్లు నిండాయి. జీవితంపై విరక్తి కలిగిందంటూ.. వివాహిత(22).. అన్న స్నేహితుడి ఫోన్​కు సందేశం పంపి.. ఫోన్‌ స్విచ్‌ ఆపేసింది. తర్వాత ఏమైందింటే

Suicide
Suicide

By

Published : Aug 6, 2021, 10:34 AM IST

అత్తింటి ఆరళ్లకు కాళ్లపారాణి ఆరకముందే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన దుబ్బాక పురపాలికలో గురువారం వెలుగులోకి వచ్చింది. దుబ్బాక ఎస్‌ఐ మన్నె స్వామి తెలిపిన వివరాలు.. దుబ్బాక పురపాలిక చెల్లాపూర్‌ రెండో వార్డుకు చెందిన అక్కల రాధా కిషన్‌ గౌడ్‌, లక్ష్మిల పెద్ద కుమార్తె పవిత్ర అలియాస్‌ తేజస్విని(22)ని దుబ్బాక మండలంలోని గంభీర్‌పూర్‌ గ్రామానికి చెందిన చేపూరి యాదయ్య, బాల లక్ష్మిల ఏకైక కుమారుడు శ్రీకాంత్‌ గౌడ్‌కు ఇచ్చి మే 28, 2021న వివాహం చేశారు. పవిత్ర అత్తింటికి వచ్చిన నాటినుంచి భర్త, అత్త తీవ్రంగా వేధించసాగారు. దీంతో మానసికంగా కలత చెందిన ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.

బుధవారం బీఎడ్‌ సెమిస్టర్‌ పరీక్ష ఉండటంతో ఆమెను భర్త శ్రీకాంత్‌ గౌడ్‌ దుబ్బాకలోని కళాశాల వద్ద వదిలి వెళ్లాడు. పరీక్ష రాసిన తర్వాత ఆమె తన అన్న స్నేహితుడి చరవాణికి తనకు జీవితంపై విరక్తి కలిగిందంటూ సంక్షిప్త సమాచారం పంపించి ఫోన్‌ స్విచ్‌ ఆపేసింది. తర్వాత కళాశాల నుంచి కాలినడకన వెళ్లి పట్టణ సమీపంలోని పెద్దచెరువులో దూకింది. పవిత్ర అన్న స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో కంగారుపడ్డ కుటుంబసభ్యులు, బంధువులు దుబ్బాక పట్టణంలో గాలించినా ప్రయోజనం లేకపోయింది.

దీంతో వారు బుధవారం రాత్రి దుబ్బాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం పవిత్ర మృతదేహం చెరువు నీటిలో తేలగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీయించి శవపరీక్ష నిమిత్తం సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని సిద్దిపేట ఇన్‌ఛార్జి ఏసీపీ సైదులు సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్తింటి ఆరళ్ల భరించలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని పవిత్ర తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఇదీ చూడండి:pulichinthala: పులిచింతల ఘటన.. నిర్మాణ లోపాలే ప్రధాన కారణాలు

ABOUT THE AUTHOR

...view details