తెలంగాణ

telangana

ETV Bharat / crime

వైద్యుల నిర్లక్ష్యం... పురిటిలోనే శిశువు మృతి - పురిటిలోనే బిడ్డ మృతి

వైద్యుల నిర్లక్ష్యం... ఈ లోకాన్ని చూడాల్సిన ఆ పసికందుకు శాపమైంది. కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన ఆ తల్లికి కడుపు కోత మిగిల్చింది. తండ్రికి కన్నీరు మిగిల్చింది. ఈ విషాద ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.

infant baby died
infant baby died

By

Published : May 15, 2022, 1:19 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవ సమయంలో శిశువు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మరణించాడని బంధువులు ఆరోపించారు. మల్దకల్ మండలం మద్దెల బండ తండాకు చెందిన వెంకటమ్మ.. కాన్పు కోసం గద్వాల ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు పరీక్షలు నిర్వహించి మొదట తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు.

ఈ క్రమంలో వెంకటమ్మకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆందోళన చెందిన మహిళ బంధువులు వైద్యులకు తెలిపారు. వైద్యులు శస్త్ర చికిత్స చేస్తుండగా... అప్పటికే శిశువు మరణించాడు. దీంతో బాధిత మహిళ బంధువులు వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయాడని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​డ్డి ఆసుపత్రికి చేరుకొని.. వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని... లేదంటే మీపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.

ABOUT THE AUTHOR

...view details