Husband murdered due to Extra Marital Affair: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించిన ఘటన ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగింది. అయితే ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే దర్యాప్తు ఆపేయాలని మృతుడి భార్య పదే పదే కోరడంతో అనుమానం వచ్చిన పోలీసులు తీగ లాగడంతో డొంకంతా కదిలింది. అదనపు ఎస్పీ అనిల్‌కుమార్ కేసు వివరాలను వెల్లడించారు.
డెంకాడ మండలం డి.బాడువకు చెందిన డి.రామకృష్ణ (51) ఆటో నడుపుతూ వచ్చిన సొమ్మును మద్యం తాగేందుకు ఖర్చు చేసేవాడు. డబ్బులు లేకపోతే భార్య లక్ష్మిని అడిగేవాడు. ఆమె పైడిభీమవరంలోని ఫార్మా కంపెనీ క్యాంటీన్‌లో హెల్పర్‌గా పని చేస్తోంది. అదే కంపెనీలో సూపర్‌వైజర్‌గా చేస్తున్న పెద్ద తాడివాడకు చెందిన బి.దశకంఠేశ్వరరావుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. లక్ష్మి అవసరాలకు అతనే డబ్బులు సమకూర్చేవాడు.
ఏడాది కిందట ఈ విషయం రామకృష్ణకు తెలియడంతో ఇంట్లో వారిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న రామకృష్ణను అడ్డు తొలగించుకునేందుకు పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. నిరాశ చెందిన లక్ష్మి.. దశకంఠేశ్వరరావుతో వాగ్వాదానికి దిగింది. 'ఓ తాగుబోతుని చంపలేని నువ్వు దేనికి పనికొస్తావం'టూ రెచ్చగొట్టింది. దీంతో పౌరుషానికి దిగిన ప్రియుడు.. తన సహోద్యోగి పూసపాటిరేగ మండలానికి చెందిన జి.శంకరరావు సహాయంతో ప్రణాళిక రచించాడు. వంతెన పైనుంచి తోసేయాలని భావించారు.