Wife Catches Husband Redhandedly: భార్యను కాదని.. వేరే మహిళతో వివాహేతరసంబంధం పెట్టుకున్న భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన కుత్బుల్లాపూర్‌లో చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టకు చెందిన అనిల్ విద్యుత్ సంస్థలో ఆర్టిజన్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతనికి ఏడేళ్ల క్రితం రమేశ్వరితో వివాహమైంది. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. అప్పటినుంచి అనిల్ అదనపు కట్నం కోసం భార్యను వేధించడం ప్రారంభించాడు. ఆమె పేరుపై ఉన్న ప్లాటును అమ్మమని కోరగా... ఆమె నిరాకరించింది.
వేరే మహిళతో సంబంధం పెట్టుకున్న భర్త.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య - భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
Wife Catches Husband Redhandedly: ధర్మార్థ కామములోన ఏనాడు నీతోడు ఎన్నడు నే విడిచి పోనూ.. అని పెళ్లి చేసుకున్న భర్త. ఓ బిడ్డ జన్మించాక భార్యను అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. ఆమె పేరు మీద ప్లాటును అమ్మమని కోరాడు. తాను చేసిన తప్పెంటో తెలియక భార్య లోలోపలే కుమిలిపోయింది. కానీ చివరకు ఆమెకు తెలిసిందేంటంటే.. తప్పు ఆమెది కాదని. వేరే మహిళ మోజులో పడిన భర్తది అని.
భర్త ఎందుకు ఇలా మారాడో ఆలోచించిన భార్యకు మెల్లిగా సమాధానం దొరికింది. అనిల్ కొన్నేళ్లుగా వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడమే ఇందుకు కారణమని గుర్తించింది. భార్యకు అనుమానం రాకుండా.. వేరే మహిళతో సంబంధం పెట్టుకున్న అనిల్.. ఆమెతోనే కుత్బుల్లాపూర్ బ్యాంక్ కాలనీలో రెండేళ్లుగా నివాసముంటున్నాడు. విషయం తెలుసుకున్న రమేశ్వరి.. ఈ రోజు ఉదయం తెల్లవారు జామున రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అతనిని కొట్టి పోలీసులకు అప్పగించింది. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని కోరింది.
ఇదీ చూడండి:Life Imprisonment: కుక్క తెచ్చిన తంటా.. ముగ్గురికి జీవిత ఖైదు