సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. భార్యాభర్తలు విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ విషాదం జరిగింది. దంపతులు శ్రీధర్, దీపిక.. శాంతి నగర్ కాలనీలో నివాసముంటున్నారు. కార్యాలయం నుంచి తిరిగివస్తుండగా రహదారిపై శ్రీనగర్ వెళ్లే కూడలి సమీపంలో వారిని టిప్పర్ ఢీ కొట్టింది. భర్త అక్కడికక్కడే చనిపోగా భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో ఆమె కూడా మృతిచెందింది.
దంపతుల ఉసురు తీసిన టిప్పర్.. ఆఫీస్‌కి వెళ్లొస్తుండగా ప్రమాదం - wife and husband died in road accident
విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. పటాన్చెరు జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న దంపతులను టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది.
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి