తెలంగాణ

telangana

ETV Bharat / crime

పెళ్లి వాహనం బోల్తా.. వధువు తల్లితో సహా 9 మందికి తీవ్ర గాయాలు - auto accident

Accident to Wedding Vehicle: పెళ్లికూతురితో పాటు బంధువులంతా మండపానికి ఓ వాహనంలో వెళ్లిపోయారు. మిగిలిపోయిన బంధువులను తీసుకుని వధువు తల్లి ఇంకో వాహనంలో బయలుదేరింది. పట్టుచీరల ముచ్చట్లు.. పెళ్లి సందడితో ఉన్న ఆ వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి బోర్లాపడింది. ఈ ఘటన కుమురం భీం జిల్లా చింతలమనేపల్లి మండలం ఆడేపల్లి వద్ద జరిగింది.

wedding vehicle caught accident and 9 people including bride's mother were seriously injured
wedding vehicle caught accident and 9 people including bride's mother were seriously injured

By

Published : Feb 20, 2022, 5:44 PM IST

Accident to Wedding Vehicle: కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా చింతలమనేపల్లి మండలం ఆడేపల్లి సమీపంలో ఓ పెళ్లి వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పెళ్లి కూతురు తల్లితో పాటు మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాబాసాగర్ గ్రామానికి చెందిన సుమిత్ర కూతురు సునీతను ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామానికి చెందిన రమేష్​కు ఇచ్చి వివాహం చేసేందుకు నిశ్చయించారు. ఈరోజే(ఫిబ్రవరి 20) వివాహం మూహుర్తం కావటం వల్ల.. బంధువులంతా సిద్ధమయ్యారు. మొదటగా వధువుని సిద్ధం చేసి ఆమెతో పాటు బంధువులంతా ఓ వాహనంలో పెళ్లి మండపానికి వెళ్లారు.

ఒక్కసారిగా అదుపుతప్పి..

మిగిలిపోయిన మిగతా బంధువులను సిద్ధం చేసుకుని వధువు తల్లి సుమిత్ర.. టాటా ఏస్​ వాహనంలో గుండి గ్రామానికి బయలుదేరింది. వాహనంలో అందరు పెళ్లి గురించి.. సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. ఆడేపల్లి సమీపంలోని చేరుకోగానే ఒక్కసారిగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. వాహనంలో ఉన్న 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. అప్పటి వరకు సంతోషంతో ఉన్న వాళ్లంతా ఏడుస్తున్నారు. ముఖాలకు, చేతులకు, కాళ్లకు దెబ్బలు తగిలి రక్తస్రామవుతోంది. ఎంతో ఇష్టంగా కట్టుకున్న పట్టుబట్టలకు రక్తపు మరకలు అంటుకున్నాయి. ఉత్సాహంగా వాహనం ఎక్కిన బంధువులు.. దిగి రెండు అడుగులు కూడా వేయలేక ఇబ్బందిపడుతున్నారు.

ఎమ్మెల్యే దంపతుల స్పందన..

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని.. క్షతగాత్రులను కాగజ్​నగర్​లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులతో పాటు ఆస్పత్రికి వెళ్లి.. దగ్గరుండి చికిత్స చేపించారు. ఎంతో సంతోషంగా పెళ్లికి వెళ్తుంటూ.. ఇలా జరిగిపోయిందని బాధితులు రోధిస్తుంటే.. వాళ్లకు ధైర్యం చెప్పారు.

పెళ్లి వాహనం బోల్తా.. వధువు తల్లితో సహా 9 మందికి తీవ్ర గాయాలు

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details