Volunteer Raped a Woman in Srikakulam District: తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా నివసిస్తున్న దళిత యువతిపై గ్రామ వాలంటీరు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాధితురాలు గర్భం దాల్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటకు చెందిన దళిత యువతి తల్లిదండ్రులు.. కొన్ని నెలల క్రితం మరణించారు. నాటి నుంచి ఆమె మందస మండలంలో యాచిస్తూ జీవనం సాగిస్తోంది.
ఒంటరి యువతిపై గ్రామ వాలంటీరు అత్యాచారం.. గర్భం దాల్చడంతో వెలుగులోకి - Volunteer Raped a Woman
Volunteer Raped a Woman in Srikakulam District: తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా ఉంటున్న యువతిపై పశుత్వం ప్రదర్శించాడు ఓ వాలంటీర్. ఎవరూ లేని ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు గర్భం దాల్చడంతో మందస పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.
Volunteer Raped a Woman
రాత్రిపూట స్థానిక ఎంపీడీవో కార్యాలయ వరండాలో నిద్రిస్తోంది. దాదాపు నెల క్రితం అదే మండలంలోని జిల్లుండకు చెందిన గ్రామ వాలంటీరు కణితి బాలకృష్ణ ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు గర్భం దాల్చడంతో మంగళవారం మందస పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేశామని.. నిందితుడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: