తెలంగాణ

telangana

ETV Bharat / crime

కత్తుల వేట ఇవాళ్టికి వాయిదా

న్యాయవాద దంపతుల హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు తలమునకలయ్యారు. పెద్దపల్లి జిల్లా సుందిళ్ల బ్యారేజీలో నిందితులు వాడిన కత్తులను 58-60 పిల్లర్ల మధ్య.. వెలికితీసేందుకు ఆంధ్రప్రదేశ్​లోని విశాఖకు చెందిన గత ఈతగాళ్లను పోలీసులు రంగంలోకి దింపారు. నాలుగు గంటలపాటు గాలించి..చీకటి పడటంతో ప్రస్తుతం ఈరోజుకి వాయిదా వేశారు.

vishaka swimmers searching for knives in sundilla barrage
కత్తుల వేట ఇవాళ్టికి వాయిదా

By

Published : Feb 28, 2021, 1:51 PM IST

Updated : Mar 1, 2021, 8:48 AM IST

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో విచారణ ముమ్మరం చేశారు. హత్యకు ఉపయోగించిన కొడవళ్ల స్వాధీనానికి పోలీసులు యత్నాలు మొదలుపెట్టారు. ఉదయం కుంట శ్రీను, మరొకరిని పెద్దపల్లి జిల్లా పార్వతీ బ్యారేజీ వద్దకు తీసుకెళ్లిన పోలీసులు... వారు 58-60 పిల్లర్ల మధ్య కొడవళ్లను పడేసినట్లు తెలుసుకున్నారు.

ఏపీలోని విశాఖ నుంచి వచ్చిన గజ ఈతగాళ్లతో ఆయుధాల కోసం నాలుగు గంటల పాటు గాలించారు. బ్యారేజీలోని 58-60 పిల్లర్ల వద్ద ఈ గాలింపు జరిగింది. అక్కడ నీరు 10 నుంచి 15 మీటర్ల లోతు వరకు ఉండటంతో.. గజ ఈతగాళ్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి. చీకటి పడటంతో హత్యకు కొడవళ్ల గాలింపు ఈరోజుకి వాయిదా వేశారు.

ఈ కేసులో ముగ్గురు నిందితులు మూడు రోజులుగా కస్టడీలో ఉన్నారు. తాజాగా నాలుగో నిందితుడు బిట్టు శ్రీనును కూడా మంథని కోర్టు కస్టడీకి ఇచ్చింది. హత్యకు సంబంధించిన కారణాలు... దాని వెనక ఉన్నవారి వివరాలు రాబట్టేందుకు నిందితులను పోలీసులు అన్ని విధాలా విచారిస్తున్నారు.

కత్తుల వేట ఇవాళ్టికి వాయిదా

ఇదీ చూడండి:బిట్టు శ్రీను కస్టడీ కోసం మంథని కోర్టులో పోలీసుల పిటిషన్

Last Updated : Mar 1, 2021, 8:48 AM IST

ABOUT THE AUTHOR

...view details