తెలంగాణ

telangana

ETV Bharat / crime

యువకుడిపై ఎస్సై దాష్టీకం.. తలపై కత్తితో దాడి..! - యువకుడిపై ఎస్​ఐ దాష్టీకం

ఏపీలోని బాపట్ల జిల్లా వేమూరు ఎస్సై అనిల్.. ఓ యువకుడిపై దాష్టీకం ప్రదర్శించారు. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడిని స్టేషన్​కు పిలిపించి విచక్షణా రహితంగా చితకబాదాడు. తలపై కత్తితో దాడి చేయటంతో యువకుడికి తీవ్ర గాయమైంది. కుమారుడి గాయం చూసి అతని తల్లి స్టేషన్​లోనే స్పృహ తప్పి పడిపోయింది.

యువకుడిపై ఎస్సై దాష్టీకం.. తలపై కత్తితో దాడి..!
యువకుడిపై ఎస్సై దాష్టీకం.. తలపై కత్తితో దాడి..!

By

Published : Jul 7, 2022, 7:14 AM IST

యువకుడిపై ఎస్సై దాష్టీకం.. తలపై కత్తితో దాడి..!

ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం పరిధిలో రెండు వర్గాల యువకుల మధ్య జరిగిన గొడవ పోలీస్ స్టేషన్‌కు చేరింది. షేక్ మహమ్మద్ రఫీ అనే 19 ఏళ్ల యువకుడిపై ఫిర్యాదు వచ్చిందని ఎస్సై అనిల్ కుమార్ అతడి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. స్టేషన్​కి వచ్చి సానుకూలంగా పరిష్కరించుకోవాలని సూచించారు. గ్రామ పెద్దలతో కలిసి కుటుంబసభ్యులు రఫీని స్టేషన్‌కి తీసుకెళ్లారు. అక్కడ ఎస్సై అనిల్ కుమార్ తనపై దాడి చేసినట్లు రఫీ ఆరోపిస్తున్నాడు.

"ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి ఎస్సై విచక్షణా రహితంగా చితకబాదాడు. గదిలోకి తీసుకెెళ్లి వీపుపై కొట్టాడు. పలుమార్లు తలను గోడకేసి బాదాడు. నా తలపై ఉన్న జుట్టును కత్తితో కోశాడు. సరిగా తెగలేదని మళ్లీ రెండోసారి గట్టిగా కోయడంతోపై చర్మం సహా లేచి రావటంతో తీవ్ర రక్తస్రావమైంది. బయటికి వెళ్లడానికి ప్రయత్నించగా వెళ్లడానికి వీల్లేదని.. డాక్టర్ స్టేషన్​కు వచ్చి వైద్యం చేసే వరకు ఇక్కడే ఉండాలని హుకూం జారీ చేశాడు. కానీ భయం వేసి ఒక్కసారిగా బయటికి పరుగు తీసి కుటుంబ సభ్యుల వద్దకు చేరుకున్నా." అని బాధితుడు రఫీ ఆరోపించాడు.

రక్తమోడుతున్న కుమారుడిని చూసి రఫీ తల్లి స్టేషన్ ఆవరణలోనే స్పృహ తప్పి పడిపోయింది. ఆమె తలకు గాయం కావటంతో రఫీతో పాటు ఆమెను తెనాలి ఆసుపత్రికి తరలించారు. రఫీ తల్లి పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details