సూర్యాపేట జిల్లా కోదాడ 65వ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు సిద్ధిపేట జిల్లా తెలుగుపల్లికి చెందిన అన్వేష్‌గా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా కోదాడ బైపాస్ వద్ద ప్రమాదం జరిగింది.
వాహనం ఢీ.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు - Suryapet District crime news
టాటా ఏస్ వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.
వాహనం ఢీ.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు
వేగంగా వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించిందని ఎస్సై రవీందర్ తెలిపారు. మృతుడు అన్వేష్, తీవ్రగాయలైన రాహుల్‌ను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
ఇదీ చూడండి :పేకాట వ్యసనం.. 50 లక్షలు స్వాహా