మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలంలో దారుణం జరిగింది. పొన్నాల చెరువులో చేతులు కట్టేసి ఉన్న ఓ యువతి మృతదేహం లభ్యమైంది. దుండగులు యువతిపై లైంగికదాడి చేసి చెరువులో పడేసినట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... చెరువులో నుంచి యువతి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆమెను అత్యాచారం చేసి.. హత్య చేసుంటారని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు.
చెరువులో యువతి మృతదేహం.. హత్యాచారమేనా..? - young woman dead body at medchal
10:37 January 09
చేతులు కట్టేసిన స్థితిలో యువతి మృతదేహం గుర్తింపు
ఇదీ జరిగింది...
పొన్నాల గ్రామంలోని ఎర్రగుంటలో యువతి(26) మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. రెండు రోజుల క్రితం ఎక్కడో హత్యాచారం... మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. యువతి హత్య విషయమై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుదీర్ కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:LB Nagar Car Accident : కారు బీభత్సం.. రూ.13,350 పెండింగ్ చలాన్లు!