రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆ సన్నివేశం స్థానికులను కలచివేసింది. అప్పుడే పుట్టిన పసికందు(ఆడ శిశువు)ను గుర్తుతెలియని మహిళ.. స్థానిక పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతంలో వదిలివెళ్లింది. కొద్దిసేపటి తర్వాత అటుగా వెళ్తున్న స్థానికులు.. పాప ఏడుపు వినబడటంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
పోలీస్ స్టేషన్ సమీపంలో ఆడ శిశువు.. సంరక్షణ అధికారులకు అప్పగింత - infant found in sircilla
ఆడపిల్లను ఇంటికి మహాలక్ష్మీ అంటారు. రూపంలో లక్ష్మీ దేవిగా భావించినా.. చూసే విధానంలో మాత్రం ఇంటికి భారంగానే భావిస్తున్నారు. ఆర్థిక సమస్యలా.. అవాంఛిత గర్భమా.. కారణం ఏదైతేనేం.. గత కొంతకాలంగా ముళ్ల పొదలు, చెత్త కుండీలు, రోడ్డు పక్కన, నిర్మానుష్య ప్రదేశాల్లో ఆడ శిశువులు జీవంతోనో, అచేతనంగానో కనిపించడం పరిపాటి అయింది. కనిపించని అమ్మవారిని ఆది పరాశక్తిగా భావించి.. విగ్రహం పెట్టుకుని పూజిస్తున్నారు కానీ.. కళ్ల ముందు ఉన్న ఆడపిల్లల పట్ల మాత్రం కొందరు మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్నారు.
సమాచారం అందుకున్న ఎస్సై వెంకటేశ్వర్లు, సిబ్బంది.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నవజాత శిశువును పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. పాప ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన పీహెచ్సీ వైద్యులు సంజీవ రెడ్డి.. ఆరోగ్యంగా ఉందని తెలిపారు. అనంతరం పోలీసులు, వైద్య సిబ్బంది.. ఐసీడీఎస్, ఐసీపీఎస్ అధికారులు లక్ష్మణ్, త్రివేణి, రమ్యలకు పసికందును అప్పగించారు.
ఇదీ చదవండి:Gold Fraud: దుబాయ్ గోల్డ్ తక్కువ ధరకే.. ఫేస్బుక్లో ప్రకటన.. ఇదో క్రైం స్టోరీ!