Cyber Crime: మాయమాటలు చెప్పి ఓ మహిళ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ. 31 లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. నగరానికి చెందిన మహిళ వాట్సాప్‌నకు ఓ లింక్ వచ్చింది. దానిపై క్లిక్ చేసిన కొద్దిసేపటికే ఓ వ్యక్తి వాట్సాప్ కాల్ చేశాడు. ఈ సైట్‌లో మీరు ఖాతా తెరిచి కొంత పెట్టుబడి పెట్టి తాము పంపించే వీడియోలకు లైక్‌లు కొడితే.. ఒక్కో లైక్‌కు కొంత డబ్బు ఇస్తామని నమ్మించాడు.
Cyber Crime Hyderabad: లైక్‌లు కొడితే లాభాలిస్తామని... రూ.31 లక్షలు స్వాహా!! - హైదరాబాద్ సైబర్ క్రైమ్ వార్తలు
Cyber Crime: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. చివరికి మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా తాము చెప్పిన వీడియోలకు లైక్‌లు కొడితే లాభాలిస్తామని నమ్మించి.... రూ.31 లక్షలు దండుకున్నారని ఓ బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ కంపెనీ బ్రిటన్‌లో ఉండగా.. తన కార్యాలయం సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట్‌లోనే ఉందన్నాడు. బాధితురాలు మొదట రూ.2.50 లక్షలు పెట్టగా వారం రోజుల్లో రూ.25 వేలు లాభం వచ్చింది. దాంతో బాధితురాలు విడతలవారిగా మొత్తం రూ.31 లక్షలు పెట్టేశారు. మొదట కొంత మొత్తం ఇచ్చినా.. తరువాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. కాల్ చేసినా ఎలాంటి స్పందన లేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
ఇదీ చదవండి:Cyber Crime mails: సైబర్ మోసాల్లో నయా ట్రెండ్.. ఆ మెయిల్స్‌తో జాగ్రత్త..!