రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఠాణా పరిధి గోల్డెన్హైట్స్లో ఓ యువతి అనుమానాస్పత స్థితిలో మృతి చెందింది. జన చైతన్య వెంచర్‌లోని నిర్మాణంలో ఉన్న ఓ ఏడంతస్తుల భవనంపై నుంచి దూకి గుర్తుతెలియని యువతి మృతి చెందింది.
గుర్తుతెలియని యువతి అనుమానాస్ఫద స్థితిలో మృతి - భవనంపై నుంచి పడి యువతి మృతి
నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల అపార్టుమెంటుపై నుంచి కిందపడి ఓ యువతి మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్‌లో జరిగింది.
young lady suspected death, rajandra nagar, rangareddy
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు కింద పడిందా... లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని.. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని సీఐ కనకయ్య తెలిపారు.
ఇదీ చూడండి:ఈత రాకున్నా బావిలోకి దిగి మృతి