తెలంగాణ

telangana

ETV Bharat / crime

రెండు కుటుంబాల్లో విషాదం నింపిన జన్మదిన వేడుకలు - పుట్టినరోజు వేడుకలో విషాదం

అప్పటి వరకు స్నేహితులు, కుటుంబసభ్యులతో ఎంతో సంతోషంగా సముద్రతీరంలో బర్త్​డే వేడుకలు జరుపుకున్నారు. అంతలోనే ఒక్కసారిగా విషాదం నెలకొంది. ముఖానికి అంటుకున్న కేక్​ను కడుక్కోవడానికి వెళ్లిన ఇద్దరు యువకులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కళ్ల ముందే స్నేహితులు సముద్రంలో గల్లంతు కావడంతో మిగతా వారంతా విషాదంలో మునిగిపోయారు.

Two Young Boys Died
Two Young Boys Died

By

Published : Dec 26, 2022, 12:47 PM IST

స్నేహితులు, కుటుంబసభ్యులతో ఎంతో సంతోషంగా జన్మదిన వేడుకలు జరుపుకున్న ఆ యవకుడు ఒక్కసారిగా అందరికి విషాదాన్ని మిగిల్చి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. మొగల్తూరు మండలం కేపీపాలెం సౌత్​ యాళ్లవారిమెరకకు చెందిన రాజేశ్​(19)తో పాటు అతడి స్నేహితుడు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి చనిపోయారు. రాజేశ్​ పుట్టిన రోజు వేడుక నిమిత్తం స్నేహితులతో కలిసి గ్రామంలోని సముద్ర తీరానికి వెళ్లాడు. తీరంలో ఆనందంగా బర్త్​డే వేడుకలు జరుపుకున్నాడు. ఇంతలో ముఖానికి అంటుకున్న కేక్‌ను కడుక్కునేందుకు రాజేశ్​, అతడి స్నేహితుడు అరవింద్‌ సముద్రంలోకి వెళ్లారు.

ఇంతలో ఉద్ధృతంగా వచ్చిన ఓ కెరటం ఇద్దరినీ సముద్రంలోకి లాక్కెళ్లింది. దీంతో కళ్లముందే స్నేహితులు ఇద్దరు కొట్టుకుపోయారు. వారి కోసం బంధువులు, పోలీసులు గాలించగా.. మోళ్లపర్రు సమీపంలో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. సంతోషంగా ఇంటి నుంచి వెళ్లి.. విగత జీవులుగా తిరిగొచ్చిన బిడ్డలను చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.

ఇద్దరు యువకులు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులు రాజేశ్​ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా.. అరవింద్‌ ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details