తెలంగాణ

telangana

ETV Bharat / crime

Two girls missing: వాగులో ఇద్దరు యువతుల గల్లంతు... ఓ మృతదేహం లభ్యం - వాగులోపడి ఇద్దరు యువతులు గల్లంతు

Two young women's
Two young women's

By

Published : Aug 30, 2021, 2:09 PM IST

Updated : Aug 30, 2021, 9:16 PM IST

14:05 August 30

వరద ఉద్ధృతికి వాగులో కొట్టుకుపోయిన యువతులు

వాగులో ఇద్దరు యువతుల గల్లంతు... ఒకరి మృతదేహం లభ్యం

 యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కుర్రారం వద్ద.... వాగులో పడి ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. యాదగిరిగుట్ట నుంచి రాజపేట మండలం బొందుగులకు గ్రామంలో ఓ ఫంక్షన్​కు ఓ యువకుడు, ఇద్దరు యువతులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా దోసలవాగు ఉధృతిలో బైక్ మీది నుంచి పడిపోయారు. ముగ్గురు చేతులు పట్టుకొని నెమ్మదిగా నడుస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నంచేశారు. కానీ నీటి ఉధృతికి సింధూజ(24), బిందు(14) కొట్టుకుపోయారు. యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. గల్లంతైన వారిలో సింధూజ మృతదేహం లభించగా.. బిందు కోసం గాలిస్తున్నారు. మృతురాలు జనగామ జిల్లా చిన్నకోడూరు వాసిగా గుర్తించారు. 

ఇద్దరు యువతులు, ఓ అబ్బాయి బండిపై వస్తున్నారు. వాగు మధ్యలోకి వచ్చేసరికి బండి ఆగిపోయింది. వాగు ప్రవాహానికి కింద పడిపోయారు. అబ్బాయి ఒకవైపు, అమ్మాయిలో మరోవైపు పడిపోయారు. బండి కొట్టుకుపోయింది. పడిపోయినవారంతా ఎలాగోలా పైకి లేచారు. ముగ్గురు ఒకరికొకరు చేతులు పట్టుకుని కొంతదూరం వచ్చారు. ఇంతలో ఓ అమ్మాయి కాలు జారిపోయింది. కిందపడిపోయిన ఆమె... మరో అమ్మాయి కాలు పట్టుకుంది. ఇద్దరు చూస్తుండగానే కొట్టుకుపోయారు. - స్థానికుడు 

ఇదీ చూడండి:వాగులో కారు గల్లంతు... వధువుతో పాటు మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం

Last Updated : Aug 30, 2021, 9:16 PM IST

ABOUT THE AUTHOR

...view details