తెలంగాణ

telangana

ETV Bharat / crime

Tragedy In Ganesh Immersion: నిమజ్జన వేడుకల్లో విషాదం.. ప్రమాదవశాత్తు ఇద్దరు మృతి - Tragedy In Ganesh Immersion news

ఆ ఊళ్లో ఎంతో ఉత్సాహంగా చిన్నాపెద్దా అంతా కలిసి గణేశ్​ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లతో వినాయకుడిని ఊరేగిస్తున్నారు. ఆ శబ్దాలకు అనుగుణంగా యువకులు తమను తాము మరిచిపోయి నృత్యాలు చేస్తున్నారు. ఇంతటి సంతోష సమయంలో ఒక్కసారిగా ఆ గ్రామంలో విషాదఛాయలు(Tragedy In Ganesh Immersion) అలుముకున్నాయి. విద్యుదాఘాతంతో ఒకరు, సంబురాలు చేసుకుంటూ మరొకరు మృతి చెందారు. నిర్మల్​ జిల్లా కౌట్ల(బి) గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

tragedy in ganesh immersion
గణేశ్​ నిమజ్జనంలో విషాదం

By

Published : Sep 25, 2021, 10:30 AM IST

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని కౌట్ల (బి) గ్రామంలో జరిగిన గణేశ్​ నిమజ్జనం వేడుకల్లో విషాదం(Tragedy In Ganesh Immersion) చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నగేశ్​(25) అనే యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. శేఖర్(29) అనే మరో వ్యక్తి నిమజ్జన సమయంలో నృత్యం చేసే సమయంలో ప్రమాదవశాత్తూ కిందపడి చనిపోయాడు.

ఇద్దరు యువకులూ వినాయక నిమజ్జన సమయంలో మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది. నగేశ్​ అవివాహితుడు కాగా, శేఖర్​కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:LIVE VIDEO: సొంత బ్యాండ్​ స్టార్ట్​ చేశాడని చితక్కొట్టారు

ABOUT THE AUTHOR

...view details