తెలంగాణ

telangana

ETV Bharat / crime

సాగునీటి కాల్వలో ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మహిళలు మృతి - tractor overturned in an irrigation canal in Narayanpet district

వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలో నీటి కాల్వలో ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలోని ఎల్లిగండ్ల గ్రామ శివారులో జరిగింది.

tractor overturned in an irrigation canal in Narayanpet district
టాక్టర్ బోల్తాపడి ఇద్దరు మహిళలు మృతి

By

Published : Jun 12, 2021, 9:09 AM IST

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ నీటి కాల్వలో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. నారాయణపేట జిల్లా మరికల్ మండలం ఎల్లిగండ్ల గ్రామ శివారులో జరిగింది ఈ ఘటన. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వ్యవసాయపనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మృతులు ఎల్లిగండ్ల గ్రామానికి చెందిన జయమ్మ, సత్తెమ్మగా పోలీసులు గుర్తించారు. గాయపడ్డవారికి మరికల్​లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం నారాయణపేటలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:కేమన్‌ దీవుల్లో చైనా బెట్టింగ్‌ యాప్‌ల సొమ్ము..

ABOUT THE AUTHOR

...view details