తెలంగాణ

telangana

ETV Bharat / crime

BIKE ACCIDENT: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ.. నలుగురు మృతి - సూర్యపేట జిల్లా రోడ్డు ప్రమాదం

Naseempet bike accident: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు యువకులు మృతి చెందారు.

Naseempet bike accident
Naseempet bike accident

By

Published : Feb 11, 2022, 2:24 AM IST

Updated : Feb 11, 2022, 9:24 AM IST

bike accident at Naseempet: సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం నశింపేట వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు విడిచారు. మృతులంతా 25ఏళ్లలోపు యువకులేనని పోలీసులు వెల్లడించారు.

చివ్వెంల- ముకుందాపురం రహదారిపై నశింపేట గ్రామ శివారులో ఉన్న మూలమలుపు వద్ద వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. మృతులు మండల పరిధిలోని తెట్టెకుంట తండాకు చెందిన బానోత్ అరవింద్, బొట్యా తండాకు చెందిన భూక్యా నవీన్ , చివ్వెంల మండలం లక్ష్మీనాయక్ తండాకు చెందిన ధరావత్ ఆనంద్​, ఏపూర్​ తండాకు చెందిన వినేశ్​గా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. నలుగురు యువకుల మరణంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చూడండి:Judgment in a rape case: 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం కేసులో కోర్టు కీలక తీర్పు..

Last Updated : Feb 11, 2022, 9:24 AM IST

ABOUT THE AUTHOR

...view details