ఏపీ ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్లలో పురుగులమందు తాగి.. ఇద్దరు తెదేపా కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నిన్నరాత్రి తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య పరస్పరదాడులు జరిగాయి. ఈ క్రమంలో 11మంది తెదేపా వర్గీయులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
suicide: ఏపీలో ఇద్దరు తెదేపా కార్యకర్తల ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే.. - ap news
ఏపీలోని ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్లలో ఇద్దరు తెదేపా కార్యకర్తలు ఆత్మహత్యకు యత్నించారు. తెదేపా, వైకాపా కార్యకర్తలకు మధ్య పరస్పర దాడులు జరిగిన నేపథ్యంలో పోలీసులు తమను అరెస్టు చేయడం వల్ల మనస్తాపంతో ఇద్దరు కార్యకర్తలు పురుగుల మందు తాగారు.
suicide attempt
రాత్రి బెయిలిచ్చి ఉదయం విచారణకు రావాలని పోలీసులు ఆదేశించారు. ఇందులో ఇద్దరు కార్యకర్తలు.. అరెస్ట్‌తో మసస్తాపం చెంది పురుగుల మందు తాగినట్లు స్థానికులు తెలిపారు.
ఇదీ చూడండి:COUPLE SUICIDE: కుటుంబ కలహాలతో భార్యాభర్తల ఆత్మహత్య