మాజీమంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 104వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. హత్య కేసు నిందితుడు ఉమాశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు మూడో రోజు కస్టడీలో విచారిస్తున్నారు. ఆయుధాల గుర్తింపు కోసం అతన్ని సుదీర్ఘంగా ప్రశ్నించడంతో పాటు... కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.
Ys Viveka murder case : వివేకా హత్య కేసులో విచారణకు మరో ఇద్దరు.. - CBI Investigation on YS Viveka Murder case
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ 104వ రోజు కొనసాగుతోంది. కడప జిల్లా సింహాద్రిపురం మండలం సుంకేశుల గ్రామానికి చెందిన సోమశేఖర్ రెడ్డి, పులివెందులకు చెందిన వెంకటనాథ్రెడ్డిలు సీబీఐ విచారణకు హాజరయ్యారు.
వివేకా హత్య కేసులో విచారణకు మరో ఇద్దరు అనుమానితులు
మరో ఇద్దరు అనుమానితులు సింహాద్రిపురం మండలం సుంకేశుల గ్రామానికి చెందిన సోమశేఖర్ రెడ్డి, పులివెందులకు చెందిన వెంకటనాథ్ రెడ్డిలు సీబీఐ విచారణకు హాజరయ్యారు. నాలుగు రోజుల కస్టడీ అనంతరం ఉమాశంకర్ రెడ్డిని సోమవారం రోజు పులివెందుల కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.