fake documents for Aadhar : అసోం రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్‌లో ఉంటున్నట్లు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఆధార్కార్డుకోసం దరఖాస్తు చేశారు. వారు సమర్పించినవి ఫోర్జరీ ధ్రువపత్రాలుగా తేల్చిన ఉడాయ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
fake documents for Aadhar : ఆధార్ కోసం నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన ఇద్దరిపై కేసు - ఆధార్ కార్డుల కోసం ఫేక్ డాక్యుమెంట్స్
fake documents for Aadhar: హైదరాబాద్‌లో ఆధార్ కార్డు పొందడానికి నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినందుకు ఇద్దరు వ్యక్తులపై పోలీసు కేసు నమోదైంది. అసోం రాష్ట్రానికి చెందిన ఇద్దరు.. టోలీచౌకీ పరిధి షేక్‌పేటలో ఉంటున్నట్లు డాక్యుమెంట్లు సృష్టించి ఆధార్‌కార్డు పొందేందుకు ప్రయత్నించారని ఉడాయ్ (UIDAI) రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ఫిర్యాదు చేశారు.
అసోం రాష్ట్రానికి చెందిన రబ్బానీ మా, ఠాకూర్ నితీష్ సింగ్ నగరంలోని టోలీచౌకి పరిధిలో షేక్‌పేటలో నివాసముంటున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. వాటిని అమీర్‌పేట స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లోని ఆధార్ సెంటర్లో సమర్పించి ఆధార్‌కార్డు కోసం దరఖాస్తు చేశారు. వారు సమర్పించిన పత్రాలు నకిలీవిగా అధికారులు గుర్తించారు. ఈ విషయమై ఉడాయ్ (UIDAI) రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ మధుసూధనరావు... బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి:పోలీసులకు తప్పుడు సమాచారమిచ్చాడు... జైలు పాలయ్యాడు!