ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటన... మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తుర్కపల్లి నుంచి కొల్తుర్ వెళ్లే ప్రధాన రహదారిలో ప్రమాదం జరిగింది. ఘటనలో అల్వాల్‌కు చెందిన జగదీశ్(42)తో పాటు... మరో ద్విచక్రవాహనదారుడు కూడా అక్కడికక్కడే మృతిచెందాడు.
రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరు మృతి - మేడ్చల్ జిల్లా తాజా వార్తలు
మేడ్చల్ జిల్లా షామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు తెలిపారు.
మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
మృతి చెందిన ఇద్దరిలో ఒకరి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో వివరాలు సేకరించి... ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: 'తీవ్ర, అతి తీవ్రమైన లక్షణాలు ఉన్నవారినే ఆస్పత్రిలో చేర్చుకోవాలి'