తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రియుడిని తాళ్లతో కట్టేసి.. ప్రియురాలిపై అత్యాచారం - తెలంగాణ వార్తలు

ప్రేమజంటపై దాడి చేసి యువతిని అత్యాచారం చేసిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ప్రియుడిని తాళ్లతో కట్టేసి దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

two-persons-attack-on-lovers-and-after-girl-raped-by-them-in-gunturu-district
ప్రేమజంటపై దాడి చేసి.. యువతిపై అత్యాచారం

By

Published : Jun 20, 2021, 2:27 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధి సీతానగరంలో దారుణం చోటుచేసుకుంది. పుష్కరఘాట్‌లో రాత్రి ప్రేమజంటపై అఘాయిత్యం జరిగింది. కృష్ణానది తీరం ఇసుకలో కూర్చున్న ప్రేమజంటపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. ప్రియుడిపై దాడి చేసి.. తాళ్లతో కట్టేశారు. అనంతంరం పుష్కరఘాట్​లోనే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.

తెల్లవారుజామున తాడేపల్లి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. యువతిని చికిత్స కోసం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. యువతిపై అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు బ్లేడ్‌ బ్యాచ్‌ యువకులే కారణమని అనుమానించిన పోలీసులు.. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:పొంచి ఉన్న జీవాయుధ ముప్పు!

ABOUT THE AUTHOR

...view details