తెలంగాణ

telangana

కోవిఫర్​ టీకాను అధిక ధరకు విక్రయం.. ఇద్దరు అరెస్టు

కరోనా చికిత్సలో వినియోగించే కోవిఫర్ మెడిసిన్​ను నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

By

Published : Apr 19, 2021, 3:33 AM IST

Published : Apr 19, 2021, 3:33 AM IST

Two persons arrested for selling Covifor vaccine at high rates prices
కోవిఫర్​ను అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్టు

హైదరాబాద్ బీఎన్ రెడ్డి ప్రాంతంలోని ఓ మందుల దుకాణంలో కోవిఫర్​ టీకాను నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరకు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను... వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయించటమే కాక.. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న సమాచారం మేరకు... తనిఖీలు చేసినట్లు తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా మందులను ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ... ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. దుకాణం యజమాని పైడిషెట్టి రాజేశ్​, మరో వ్యక్తి గంగాభరి మహేశ్​ను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: శ్రీరామ నవమి శోభాయాత్ర రద్దు: ఎమ్మెల్యే రాజా సింగ్

ABOUT THE AUTHOR

...view details