Two people drowned in water in AP: అశ్వర్థనారాయణ స్వామి ఉత్సవాల కోసం ఆ కుటుంబమంతా బెంగళూరు నుంచి ఏపీలోని అనంతపురం జిల్లాకు వచ్చారు. అప్పటివరకు ఆడుతూ పాడుతూ గడిపిన ఆ అమ్మాయి నీటిలో పడిపోయింది. అది గమనించిన ఆమె తండ్రి కాపాడే ప్రయత్నం చేశాడు. చివరికి ఆ అమ్మాయిని ఒడ్డుకు చేర్చాడు. అనంతరం తాను ఒడ్డుకు రాలేక నీటిలో మునిగిపోతుండగా.. వారితో వచ్చిన ఓ యువకుడు అతడిని కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ యువకుడు సైతం నీటిలో మునిగిపోయాడు. నీటిలో మునిగిన విషయం తెలుసుకున్న స్థానికులతో పాటు.. పోలీసులు ఆ యువకుడిని కాపాడే ప్రయత్నం చేశారు. త్వరగా స్పందించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా చిన్నపప్పూరులోని అశ్వర్థనారాయణ స్వామి తిరునాళ్లలో విషాదం చోటు చేసుకుంది. ఆలయ సమీపంలోని పెన్నా నదిలో ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందారు. మృతులు బెంగళూరులో సిమెంట్ డీలర్‌గా పని చేస్తున్న వెంకటనారాయణ... ఉత్సవాలకు కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనానికి వచ్చారు. అతనితో పాటు శ్రీనాథ్ అనే యువకుడు కూడా వచ్చాడు. తన కుమార్తె నీటిలో పడిపోతుండగా కాపాడిన అనంతరం... వెంకటనారాయణ నీటిలో మునిగిపోయారు.