ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్ రోడ్డు తిరుపుతమ్మ గుడి సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం నుంచి సూర్యాపేట వైపు కొబ్బరి లోడుతో వెళ్తున్న డీసీఎంకు ఎద్దు అడ్డువచ్చింది. ఈ క్రమంలో దానిని తప్పించబోయిన డీసీఎం... లారీని ఢీకొట్టింది.
లారీని ఢీకొట్టిన డీసీఎం... ఇద్దరు మృతి - తెలంగాణ వార్తలు
లారీ, డీసీఎం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన కూసుమంచిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రుడుని ఆస్పత్రికి తరలించారు.
లారీని ఢీకొట్టిన డీసీఎం... ఇద్దరు మృతి
ఘటనలో డీసీఎం డ్రైవర్, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రుడుని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సతీష్ తెలిపారు.