రంగారెడ్డి జిల్లా మణికొండలో దారుణం జరిగింది. జ్వరం ట్యాబ్లెట్ ఇవ్వమని అడిగి... షాపు యజమానిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. జ్వరం ట్యాబ్లెట్ ఇస్తుండగా... మెడికల్ షాపులోకి చొరబడి యజమాని చెన్నారెడ్డిపై విచక్షణారహితంగా పిడిగుద్దుల వర్షం(Attack) కురిపించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ చెన్నారెడ్డిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు.
Viral Video: దారుణం: ట్యాబ్లెట్ ఇవ్వమని.. మెడికల్ షాపు యజమానిపై పిడిగుద్దుల వర్షం - తెలంగాణ వార్తలు
మణికొండలో ఓ మెడికల్ షాపు యజమానిపై ఇద్దరు వ్యక్తులు దాడి(Attack) చేశారు. జ్వరం ట్యాబ్లెట్ ఇవ్వమని అడిగి... దాడికి దిగినట్లు బాధితుడు తెలిపారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
మెడికల్ షాపు యజమానిపై దాడి, షాపు యజమానిపై ఎటాక్
దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అకారణంగా తనపై దాడి చేశారంటూ నార్సింగి పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. దాడి(Attack) చేసింది ఎవరు..? ఎక్కడి నుంచి వచ్చారు..? ఘటనకు సంబంధించిన కారణాలపై పోలీసులు ఆరా ఆరా తీస్తున్నారు.