రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్థులను పోలీసులు అరెస్టు చేశారు. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటర్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న వాజిద్ ఖాన్, జాకీఖాన్ అనే ఇద్దరు పాత నేరస్థులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 13 ద్విచక్ర వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Arrest: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్ - Telangana news
జల్సాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
bike
ముషీరాబాద్ కు చెందిన వాజిద్ ఖాన్, జాకీఖాన్కు జైల్లో పరిచయం ఏర్పడిందని… విడుదలైన తర్వాత ఇద్దరు కలిసి బైక్ దొంగతనాలు చేసి వాటిని అమ్ముకుని జల్సాలు చేసేవారని వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. వీరిపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో 13 దొంగతనం కేసులు నమోదయ్యాయన్నారు. నిందితులు ఏ విధంగా వాహనాలను చోరీ చేస్తారో నిందితులతో డెమో ద్వారా చూపించారు.