family suicide attempt in Nizamabad: నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నింపిన కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసులో గత రాత్రి మహిళ రేఖ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం జిల్లాలోని ఏడపల్లి మండలం జానకంపేట గ్రామానికి చెందిన సాయి.. దినసరి కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో భార్య రేఖ, ఇద్దరు కుమారులు చరణ్, అరుణ్‌లతో కలిసి ఈనెల 14వ తేదీన రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఇది గమనించిన బంధువులు హుటాహుటీనా జిల్లా ఆసుపత్రికి తరలించగా.. సాయి అదే రోజు మరణించాడు. రేఖ, పిల్లలు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండుగా పిల్లలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రకటించిన డాక్టర్లు.. రేఖ పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉందని ముందు నుంచి చెప్పుకొస్తున్నారు. గత రాత్రి ఆమె మృతి చెందడంతో శవ పంచనామా చేసిన డాక్టర్లు.. బంధువులకు మృతదేహాం అప్పగించారు. రేఖ మరణంతో స్వగ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.